500 కోట్ల క్లబ్ లోకి ప్రభాస్ “కల్కి 2898ఎడి”

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కల్కి2898AD చిత్రం ధియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. తాజాగా ఈ చిత్రం 500 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్ట్ లో వెల్లడించారు. మొదటి వీకెండ్ కి ఈ రేంజ్ సెన్సేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇంకా నేటి వసూళ్లు పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

అయితే 500 కోట్ల రూపాయల క్లబ్ లో కల్కి చిత్రం చేరడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Exit mobile version