10 మిలియన్ల డాలర్లతో దూసుకు పోతున్న “కల్కి”

10 మిలియన్ల డాలర్లతో దూసుకు పోతున్న “కల్కి”

Published on Jun 30, 2024 6:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకూ 10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదే విషయాన్ని డిస్ట్రిబ్యూటర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు