నార్త్ అమెరికాలో “కల్కి” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

నార్త్ అమెరికాలో “కల్కి” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Jul 5, 2024 11:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి(Kalki 2898AD). జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం, నార్త్ అమెరికాలో కూడా అదే జోరును కనబరుస్తోంది. ఈ చిత్రం ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ 14.5 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

ఈ చిత్రం ఇదే దూకుడు కొనసాగిస్తే, లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు