రిలీజ్ కి ముందే హాఫ్ మిలియన్ డాలర్లతో అక్కడ “కల్కి” సెన్సేషన్!

రిలీజ్ కి ముందే హాఫ్ మిలియన్ డాలర్లతో అక్కడ “కల్కి” సెన్సేషన్!

Published on Jun 9, 2024 3:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. యూఎస్ ప్రాంతంలో జూన్ 26 వ తేదీన ప్రీమియర్స్ పదనున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను నార్త్ అమెరికా లో ఓపెన్ చేయగా, సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకూ 500కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. డే 1 ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తో పాటుగా పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు