రిలీజ్ కి ముందే బాక్సాఫీస్ వద్ద ఊచకోత… నార్త్ అమెరికాలో ఇది సెన్సేషన్ రికార్డ్!

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కల్కి 2898AD చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రయత్నం కి రిలీజ్ కి ముందే సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకూ 125కే టికెట్లు అమ్ముడు పోయాయి. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

ఇంకా రిలీజ్ కి సమయం ఉండటం తో, ఈ కౌంట్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఓవర్సీస్ లో ప్రభాస్ నటించిన ఈ కల్కి చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పాన్ వరల్డ్ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్ ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు.

Exit mobile version