అభిమానులకి “కల్కి” టీమ్ బంపర్ ఆఫర్!

అభిమానులకి “కల్కి” టీమ్ బంపర్ ఆఫర్!

Published on Aug 1, 2024 9:30 PM IST

రికార్డుల రారాజు ప్రభాస్ నటించిన కల్కి 2898ఎడి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. ఏ చిత్రానికి సాధ్యం కాని లాంగ్ రన్ ను కొనసాగిస్తుంది కల్కి చిత్రం. తాజాగా చిత్ర యూనిట్ మరొక ఇంట్రెస్టింగ్ ప్రమోషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 2 నుండి 9 వ తేదీ వరకు టికెట్ ధరను 100 రూపాయలకి నిర్ణయించడం జరిగింది. ఇది అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఇప్పటి వరకూ చిత్రాన్ని చూడని వారికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఈ చిత్రంలో బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు