రిలీజ్ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అలరిస్తున్న “కల్కి” టీమ్!

రిలీజ్ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అలరిస్తున్న “కల్కి” టీమ్!

Published on Jul 26, 2024 12:00 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఎడి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1,100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇంకా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ, చిత్ర యూనిట్ మంచి కంటెంట్ ను రిలీజ్ చేస్తూ, ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఇది మంచి ప్రమోషన్స్ అని చెప్పాలి. నేడు అన్నా బెన్ మరియు అమితాబ్ బచ్చన్ ల బీటీఎస్ స్టిల్స్ రిలీజ్ చేయగా, ఆర్ట్ డైరెక్టర్ సంతోష్ నారాయన్ శెట్టి ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేశారు.

ఈ సినిమా పై మరింత ఆసక్తి కలిగే విధంగా ప్రమోషన్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఫీమేల్ లీడ్ రోల్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు