రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కి సంబందించిన ప్రమోషన్స్ కూడా వేగవంతం గా జరుగుతున్నాయి. బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ తో సినిమా ఎలా ఉండబోతుంది అనే దానిపై క్లారిటీ వచ్చింది.
అయితే ఈ చిత్రం కి సంబందించిన వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్ షో పై తాజాగా క్లారిటీ వచ్చింది. నార్త్ అమెరికా లో జూన్ 26 వ తేదీన ప్రీమియర్ షోస్ పడనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించారు డిస్ట్రిబ్యూటర్స్. 2:30 PM EST, 1:30 PM CST, 12:30 PM MST, 11:30 AM PST. ఈ టైమింగ్స్ లో సినిమా ప్రీమియర్ గా ప్రదర్శింప బడనుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.