క‌ల్కి కాన్వాయ్.. దేశ‌వ్యాప్తంగా వెలుగులు!

క‌ల్కి కాన్వాయ్.. దేశ‌వ్యాప్తంగా వెలుగులు!

Published on Jun 13, 2024 5:00 PM IST

ప్ర‌స్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ త‌న ప‌ర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో క‌ల్కి మూవీని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ల‌నున్న‌ట్లుగా ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, టీజర్, ట్రైల‌ర్లు చూస్తే అర్థ‌మ‌వుతోంది.

కాగా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ను చిత్ర యూనిట్ భారీ స్థాయిలో నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే బుజ్జి రోబోటిక్ కారును దేశ‌వ్యాప్తంగా ప్ర‌ద‌ర్శిస్తూ సంద‌డి చేస్తున్న క‌ల్కి టీమ్.. తాజాగా ఓ భారీ కాన్వాయ్ ను దేశవ్యాప్తంగా తిప్ప‌నున్నారు.

ఇందులో క‌ల్కి పోస్ట‌ర్, టీజ‌ర్ల‌ను డిస్ప్లే చేయ‌నున్నారు. ప‌లు వాహ‌నాల‌కు స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా దేశ‌వ్యాప్తంగా వెలుగులు పంచేందుకు కాన్వాయ్ ను సిద్ధం చేశారు మేక‌ర్స్. ఇక దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకొనే, దిశా ప‌టాని త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు