అక్కడ రోజురోజుకి పెరుగుతున్న “కల్కి2898ఎడి” వసూళ్లు!

అక్కడ రోజురోజుకి పెరుగుతున్న “కల్కి2898ఎడి” వసూళ్లు!

Published on Jun 30, 2024 5:00 PM IST

నార్త్ ఇండియా లో ప్రభాస్ ఒక్కడే సౌత్ హీరోల్లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో. ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898ఎడి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ గ్రోత్ ను కనబరుస్తోంది. మొదటి రోజు 22.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టగా, రెండో రోజు 23.25 కోట్లు, మూడో రోజు 26.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఆదివారం భారీగా వసూళ్లను రాబట్టడం ఖాయం.

ఈ చిత్రం అక్కడ మొదటి వారాంతంకి 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు