“కల్కి” వరల్డ్ వైడ్ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

“కల్కి” వరల్డ్ వైడ్ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Jul 5, 2024 8:47 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం 8 వ రోజు వరల్డ్ వైడ్ గా 49 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ చిత్రం మొత్తం 8 రోజులకు గానూ 774 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. టికెట్ రేట్స్ కూడా నేటి నుండి తగ్గడంతో సినిమా ఈ వీకెండ్ కి మళ్ళీ మంచి వసూళ్లను రాబట్టడం ఖాయం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు