మాసివ్ యాక్షన్ సీన్ లో కళ్యాణ్ రామ్ నెక్స్ట్.!

మాసివ్ యాక్షన్ సీన్ లో కళ్యాణ్ రామ్ నెక్స్ట్.!

Published on Sep 14, 2024 6:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా చేస్తున్న భారీ చిత్రం “దేవర” ఇప్పుడు రిలీజ్ కి వస్తుండగా ఇంకోపక్క తాను హీరోగా నటిస్తున్న తన 21వ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. అయితే దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ హంగులతో తెరకెక్కిస్తుండగా కొన్ని వారాల కితమే సినిమాలో భారీ బడ్జెట్ తో ఓ సాలిడ్ సీక్వెన్స్ ని మేకర్స్ పూర్తి చేశారు. ఇక ఇప్పుడు మరో మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో ఈ సీన్ ని తెరకెక్కిస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి 150 మంది ఫైటర్స్, 300 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ సీక్వెన్స్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఓ క్రేజీ సీక్వెన్స్ ఈ సినిమాలో లోడ్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు