హీరో కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. గతేడాది ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో పలకరించిన ఈ నందమూరి హీరో ఈ ఏడాదికి రెండు సినిమాలను టార్గెట్ పెట్టుకున్నారు. వారిలో ఒకటి ‘రావణ’. నూతన దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. గత సినిమాలన్నింటిలో క్లాస్ లుక్లో కనిపించి ఈ చిత్రంలో మాత్రం రఫ్ లుక్ తెచ్చుకున్నారు.
భారీగా జుట్టు, గడ్డం పెంచారు. వర్కవుట్స్ చేసి బాడీని బిల్డప్ చేసుకున్నారు. ఈ లుక్ చూస్తుంటే సినిమాలో ఆయన పూర్తిస్థాయి మాస్ హీరోగా కనిపిస్తారని అర్థమవుతుంది. ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఒక చిత్రం చేయనున్నారు కళ్యాణ్ రామ్. దీన్ని కూడ ఒక కొత్త దర్శకుడే తెరకెక్కించనున్నారు. ఇలా హీరోగా సినిమాలు చూస్తూనే నిర్మాతగా కూడ చిత్రాలు నిర్మిస్తున్నారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మొదలుకానున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.