‘కళ్యాణ వైభోగమే’కి ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్!

‘కళ్యాణ వైభోగమే’కి ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Feb 15, 2016 3:36 PM IST

Kalyana-vaibhogame
వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న యువహీరో నాగశౌర్య, ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ నందిని రెడ్డిల కాంబినేషన్‌లో ‘కళ్యాణ వైభోగమే’ అన్న సినిమా రిలీజ్‌కు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నెల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకున్నా, థియేటర్ల సమస్య, ఇతరత్రా కారణాలతో వాయిదా పడింది. ఇక ప్రస్తుతం సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోన్న టీమ్ ఫైనల్‌గా మార్చి మొదటివారానికి ఫిక్స్ అయింది.

మార్చి 4న ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, ఆడియో, పోస్టర్స్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన థియేట్రిల్ హక్కులు మొత్తాన్నీ అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. పెళ్ళైన కొత్తలో భార్య, భర్తల నడుమ జరిగే ఎమోషనల్ జర్నీని నందిని రెడ్డి ఈ సినిమాలో చూపిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో మెప్పించిన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ నిర్మించారు.

తాజా వార్తలు