రికార్డ్ ధరతో “కమల్ 233” కి ఓటిటి పార్ట్నర్ లాక్ అయ్యిందా!

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో “ఇండియన్ 2” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇపుడు అంతిమ దశకి చేరుకుంటూ ఉండగా ఈ చిత్రం తర్వాత కమల్ తన కెరీర్ లో 233వ చిత్రాన్ని అయితే కోలీవుడ్ ఫేమస్ దర్శకుడు హెచ్ వినోద్ తో అయితే సినిమా లాక్ చేసారు. మరి దీనిపై నిన్ననే అప్డేట్ కూడా రాగ ఈ చిత్రం ఓటిటి డీల్ పై ఇప్పుడు బజ్ నడుస్తుంది.

అయితే ఈ చిత్రం ఓటిటి హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు రికార్డు ధరకి కొనుగోలు చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రానికి 125 కోట్లా భారీ ఆఫర్ తో నెట్ ఫ్లిక్స్ వారు డీల్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఒక్క కమల్ కెరీర్ లోనే భారీ మొత్తం కాగా తనతో పాటుగా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఓ సినిమాకి ఇంత మొత్తం డీల్ రావడం మొదటిసారి అని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

Exit mobile version