39 ఏళ్ల త‌రువాత ‘క‌ల్కి’తో ఆ ఫీట్ రిపీట్!

39 ఏళ్ల త‌రువాత ‘క‌ల్కి’తో ఆ ఫీట్ రిపీట్!

Published on Jun 27, 2024 11:00 AM IST

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఎట్ట‌కేల‌కు నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ సినిమాను ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అంద‌రి చూపులు ఈ సినిమాపై ఉన్నాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ యాక్ట‌ర్స్ అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

అయితే, వారిద్ద‌రు క‌లిసి ఒక సినిమాలో న‌టించి 39 ఏళ్లు అవుతోంది. 1985లో హిందీలో వ‌చ్చిన ‘గిర‌ఫ్తార్’ మూవీలో అమితాబ్, క‌మ‌ల్ క‌లిసి న‌టించారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ‘క‌ల్కి’ సినిమాలో వారిద్ద‌రు క‌లిసి నటించ‌డం విశేషం. సుప్రీం యాస్కిన్‌ పాత్రలో క‌మ‌ల్ హాసన్ న‌టించ‌గా, అశ్వద్ధామ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించారు.

ఇక ఈ సినిమాలో దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని, రాజేంద్ర ప్ర‌సాద్, శోభ‌న త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించ‌గా, వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్వినిద‌త్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు