కోలీవుడ్ స్టార్ యాక్టర్ లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ మూవీతో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకరైన కమల్ ఓవైపు తన మక్కల్ నీది మయ్యం పార్టీ పనులు చూసుకుంటూ మరోవైపు సినిమాలు కూడా చేస్తూ కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం కెరీర్ పరంగా మొత్తం నాలుగు సినిమాలు చేస్తున్నారు కమల్. వాటిలో శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఇండియన్ 2 ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.
ఈ మూవీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీస్తున్న కల్కి 2898 ఏడి లో కీలక పాత్ర చేస్తున్నారు కమల్. అలానే దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ థగ్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్. ఇక వీటితో పాటు ఇప్పటికే ఇండియన్ 3 మూవీకి సంబంధించి కొద్దిపాటి షూట్ కూడా పూర్తి చేసారు కమల్. ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ వచ్చే ఏడాది బిగినింగ్ లో రానుందట. ఈ విధంగా పలు క్రేజీ ప్రాజక్ట్స్ తో ఇంట్రెస్టింగ్ మూవీస్ లైనప్ తో కొనసాగుతున్నారు లోకనాయకుడు కమల్.