తమిళ స్టార్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాల్లోని లుక్స్‌పై కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దీనికి బెస్ట్ ఉదాహరణ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ అని చెప్పాలి. ఆ సినిమాలో కమల్ చాలా నార్మల్ లక్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ‘థగ్ లైఫ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కమల్, ఈ సినిమాలో మరో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా కమల్ హాసన్ మరో కొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాడు. కొత్త సినిమా కోసం మరో కొత్త లుక్‌లోకి ఆయన మారాడు. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో కమల్ సరికొత్త లుక్‌తో కనిపిస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ లుక్‌లో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
ఇలా వరుస ప్రాజెక్టులతో కమల్ బిజీగా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఈ సరికొత్త లుక్‌తో ఎలాంటి జర్నీని మొదలుపెడతా చూడాలి.