కొత్త సినిమా కోసం కొత్త లుక్‌లోకి కమల్ హాసన్

తమిళ స్టార్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన తన సినిమాల్లోని లుక్స్‌పై కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దీనికి బెస్ట్ ఉదాహరణ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ అని చెప్పాలి. ఆ సినిమాలో కమల్ చాలా నార్మల్ లక్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ‘థగ్ లైఫ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కమల్, ఈ సినిమాలో మరో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు.

ఇదిలా ఉంటే, తాజాగా కమల్ హాసన్ మరో కొత్త ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాడు. కొత్త సినిమా కోసం మరో కొత్త లుక్‌లోకి ఆయన మారాడు. దీనికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో కమల్ సరికొత్త లుక్‌తో కనిపిస్తు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ లుక్‌లో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.

ఇలా వరుస ప్రాజెక్టులతో కమల్ బిజీగా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఈ సరికొత్త లుక్‌తో ఎలాంటి జర్నీని మొదలుపెడతా చూడాలి.

Exit mobile version