తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యిన “విక్రమ్”.!


ఈ ఏడాది మూవీ లవర్స్ కి సూపర్ థ్రిల్ ఇచ్చిన అతి కొద్ది సినిమాల్లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ హీరో సూర్య కీలక పాత్రలో అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ లాంటి వెర్సటైల్ నటులు నటించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “విక్రమ్” కూడా ఒకటి.

దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లతో తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా మన తెలుగులో కూడా ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకుని భారీ లాభాలను కూడా అందించింది. ఇక ఫైనల్ గా అయితే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవ్వడానికి తెలుగులో సిద్ధంగా ఉంది.

మరి ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులని అన్ని భాషల్లో స్టార్ సంస్థ కొనుగోలు చేయగా తెలుగులో ఈ చిత్రం స్టార్ మా లో అతి త్వరలోనే టెలికాస్ట్ కానున్నట్టుగా తెలియజేస్తున్నారు. దీనితో అయితే ఈ సినిమా ఈ రానున్న కొన్ని వారాల్లోనే టెలికాస్ట్ కావడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా దర్శకుడు సీక్వెల్ ని కూడా చేయనున్నాడు.

Exit mobile version