ఉన్న కాసేపైనా రఫ్ఫాడించిన కమల్ సీన్స్.!

ఉన్న కాసేపైనా రఫ్ఫాడించిన కమల్ సీన్స్.!

Published on Jun 27, 2024 10:00 PM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ మన ఇండియన్ సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో ఒకటిగా వచ్చింది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా భారీ తారాగణం ఉంది యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి దిగ్గజాలు కూడా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక వారి పాత్రలకి మాత్రం నాగ్ అశ్విన్ సంపూర్ణ న్యాయం చేకూర్చి రానున్న సినిమాల్లో మరింత స్ట్రాంగ్ గా వారి పాత్రలు కనిపిస్తాయి అనే విధంగా ప్రెజెంట్ చేసాడు.

ఇక వీరిలో కమల్ హాసన్ ఈ చిత్రానికి చాలా తక్కువ రోజులే డేట్స్ ఇచ్చి తన షూటింగ్ ని చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే కమల్ పాత్ర తాలూకా నిడివి కూడా చాలా తక్కువే కనిపిస్తుంది. కానీ ఉన్న ఆ కొన్ని సీన్స్ కూడా రఫ్ఫాడించేసాయి అని చెప్పడంలో సందేహమే లేదని చెప్పి తీరాలి.

ఫస్టాఫ్ లో కొంచెం సేపు మళ్ళీ క్లైమాక్స్ లో చూపిన సీక్వెన్స్ లు పక్కాగా కమల్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ పాత్రకి కమల్ నే ఎందుకు తీసుకున్నారో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. మొత్తానికి కాస్టింగ్ పరంగా నటీనటుల పెర్ఫామెన్స్ లను ఇష్టపడే కల్కి మూవీ లవర్స్ కి ఒక ఫీస్ట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు