లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమానే “భారతీయుడు 2”. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రం “భారతీయుడు” కి సీక్వెల్ గా ఎన్నో ఏళ్ళు తర్వాత వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది. దీనితో థియేటర్స్ లో ఎక్కువ కాలం నిలవలేకపోయిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది.
అయితే ఈ సినిమా ముందుగా 3 గంటల నిడివితో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంలో ఎక్కువ కామెంట్స్ రావడంతో 15 నిమిషాల నిడివి తగ్గించారు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా ఓటీటీలో కూడా కట్ చేసిన వెర్షన్ లోనే అందుబాటులోకి వచ్చేసింది. దీనితో ఈ చిత్రం ఇప్పుడు 2 గంటల 45 నిమిషాలు పాటు స్ట్రీమ్ కానుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి