ఒకే ఫ్రేమ్ లో కమల్ హాసన్, రజినీకాంత్

ఒకే ఫ్రేమ్ లో కమల్ హాసన్, రజినీకాంత్

Published on Jun 28, 2024 9:30 PM IST

కోలీవుడ్ అగ్ర హీరోలు అయిన కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ లు ఒకే ఫ్రేమ్ లో మరోసారి చూడటం కన్నుల పండుగగా ఉంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా జూలై 12, 2024 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన సుందర్ రాజు తో కమల్ మరియు రజినీకాంత్ లు పోజులిచారు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి వెట్టైయాన్ లో కనిపించనున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద సూర్య నటించిన కంగువ చిత్రంతో ఈ సినిమా క్లాష్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు