కమల్ చేతులమీదుగా శ్రుతి హాసన్ పాడిన పాట రిలీజ్

స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలోని పలు భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్‌గా శ్రుతి పేరుతెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె నటనతో పాటు పాటలు కూడా పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అయితే, తాజాగా శ్రుతి హాసన్ ఓ సినిమా కోసం మరోసారి గాయినిగా మారింది. ‘ఇలెవెన్’ అనే సినిమాలో శ్రుతి ఓ పాట పాడింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రీసెంట్‌గానే చేశారు ఆ చిత్ర మేకర్స్. అయితే, దసరా కానుకగా ఈ పాటను అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘ది డెవిల్ వెయిటింగ్’ అనే ఈ పాటను ఉళగనయగన్ కమల్ హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు.

అక్టోబర్ 11న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ పాటను ఆయన రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ‘ఇలెవెన్’ చిత్రంలో ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తుండటంతో మరో విశేషం.

Exit mobile version