ఇండియన్ 2 సెట్స్‌లో జాయిన్ అయిన కమల్, కాజల్!

Published on Sep 22, 2022 1:48 pm IST

విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రం షూట్‌ను ప్రారంభించాడు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మెగా సినిమా షూటింగ్ ఈరోజు చెన్నైలో పున: ప్రారంభమైందని సమాచారం. కమల్ హాసన్ తో పాటు కాజల్ తదితరులు కూడా షూట్ లో జాయిన్ అయ్యారు.

ఈ తాజా షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో కూడిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. కమల్ తన సోషల్ ప్రొఫైల్‌లను తీసుకొని శంకర్‌తో ఆన్ సెట్ చిత్రాలను పంచుకున్నారు. ఇండియన్ 2 లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, సముద్ర ఖని, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ సహకారంతో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :