అలాంటి వ్యక్తి కనిపిస్తే ఆశ్చర్యమే – కంగనా

అలాంటి వ్యక్తి కనిపిస్తే ఆశ్చర్యమే – కంగనా

Published on Aug 18, 2024 8:32 PM IST


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకుంటుంది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై కంగనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో మీకు ఫ్రెండ్స్‌ ఉన్నారా ? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి కంగనా సమాధానమిస్తూ.. ‘నేను బాలీవుడ్‌ కు సెట్‌ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్‌ స్టైల్‌ వేరు. నాది వేరు. బాలీవుడ్ వారు, వారి గురించే ఎక్కువ ఆలోచిస్తారు’ అని కంగనా చెప్పింది.

కంగనా ఇంకా మాట్లాడుతూ.. ‘స్వార్ధంగా ఆలోచించే వారితో స్నేహం ఎలా చేయగలను ?, వాళ్ళు సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ల సుఖమే వాళ్లకు కావాలి. ఆ సుఖానికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్‌లో కనిపిస్తే ఆశ్చర్యమే. నేను అలా కాదు. అందుకే, నాకు హిందీ చిత్ర పరిశ్రమలో స్నేహితులు లేరు’ అని కంగనా చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ‘ఎమర్జెన్సీ’తో సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు