బాలీవుడ్‌ పై కంగనా రనౌత్ విమర్శలు !

బాలీవుడ్‌ పై కంగనా రనౌత్ విమర్శలు !

Published on Feb 24, 2025 12:06 AM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకుంటుంది. తాజాగా సన్యా మల్హోత్ర ప్రధాన పాత్రలో నటించిన ‘మిసెస్‌’ సినిమా పై కంగనా రనౌత్‌ పరోక్ష విమర్శలు చేసింది. జీ5 ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌ చిత్రాలు వివాహ వ్యవస్థను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపిస్తున్నారు. అలా చేయడం మానుకోవాలి’ అంటూ కంగనా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

కంగనా రనౌత్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దల గురించి చెప్పాలంటే.. వారు కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తుంటారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో సందేహం లేదు. బాలీవుడ్‌లో వచ్చే ప్రేమ కథా చిత్రాలు వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకరిస్తున్నారు’ అని ఆమె రాసుకొచ్చారు. మొత్తానికి హిందీ చిత్ర పరిశ్రమపై కంగనా ఘాటు వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ కంగనా ఇలాంటి కామెంట్స్ చాలాసార్లు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు