బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పైగా ఆమె ఇప్పుడు భాజపా ఎంపీ కూడా. అందుకే, ఈ మధ్య నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ తన పెళ్లి పై కామెంట్స్ చేసింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్.. ‘నటుడు లేదా రాజకీయ నాయకుడు.. వీరిలో మీరు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ? అనే ప్రశ్న ఎదురైంది కంగనాకి .
ఈ ప్రశ్న పై స్పందించిన కంగనా.. ‘దీని గురించి ఇప్పుడు నేనేం చెప్పగలను ?, ఐతే, పెళ్లిపై నాకు సదాభిప్రాయమే ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక భాగస్వామి ఉండాలని నేను నమ్ముతాను. అదే విధంగా పిల్లలు కూడా ఉండాలి. నాకు ఫ్యామిలీ పై ఆ ఆసక్తి ఉంది. కాకపోతే, నాపై ఎంతో నెగటివ్ పబ్లిసిటీ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. దీంతో నేను అపఖ్యాతి పాలయ్యాను. అందుకే, పెళ్లి చేసుకోలేకపోతున్నా. నాపై ఎన్నో కోర్టు కేసులు ఉన్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక నాకు ఏమైనా సమన్లు వస్తే.. అది చూసి మా అత్తమామలు పారిపోతే.. అప్పుడు నేనేం చేయాలి ?, ఒకవిధంగా ఇదీ ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదే’ అని కంగనా రనౌత్ నవ్వుతూ సరదాగా చెప్పింది.