కంగనా ఆస్తుల విలువ ఎంతంటే ?

కంగనా ఆస్తుల విలువ ఎంతంటే ?

Published on May 14, 2024 11:33 PM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఐతే, బీజీపీ పార్టీ నుంచి కంగ‌నా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగింది. ఈ రోజు నామినేషన్‌ కూడా దాఖలు చేసింది. ఐతే, తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించింది.

కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.90 కోట్లకు పైగా ఉన్నట్లు ఆమె పేర్కొంది. వీటిలో రూ.28.73 కోట్ల చరాస్తులు.. రూ.62.92 కోట్ల స్థిరాస్తులతో సహా మొత్తంగా రూ.90 కోట్లకు పైగా తనకు విలువైన ఆస్తులు ఉన్నట్లు కంగనా స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటివరకు తనపై ఎనిమిది క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని కూడా కంగనా రనౌత్ వెల్లడించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు