‘తలైవి’ కోసం ‘కంగ‌నా’ ఐదు గెటప్స్ ?

‘తలైవి’ కోసం ‘కంగ‌నా’ ఐదు గెటప్స్ ?

Published on May 24, 2020 11:30 PM IST


దివంగత నేత జయలలిత బయోపిక్ గా రాబోతున్న చిత్రం ‘తలైవి’. తమిళ డైరెక్టర్ ఎ.ఎల్‌.విజ‌య్ దర్శకత్వంలో రానున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది.

కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం తమిళం కూడా నేర్చుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. మరి ఏ రేంజ్ లో మెప్పిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు