కంగ‌నా ‘తలైవి’ లేటెస్ట్ అప్ డేట్ !

కంగ‌నా ‘తలైవి’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 18, 2020 1:00 AM IST

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ షూట్ ను కూడా ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా రఫ్ ఎడిటింగ్ పూర్తి అయిందని.. కంగనా దగ్గర ఉండి మరి తనకు నచ్చినట్టు ఎడిటింగ్ చేయించదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. పైగా సినిమాలో మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు