కంగనా ‘తలైవి’ రాక పై క్లారిటీ !

Published on Jan 19, 2021 2:02 am IST

తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు. గతంలోనే ఈ వార్త వచ్చినా.. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వడంతో మేకర్స్ మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. కాగా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది.

మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు.. అనగా ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు

సంబంధిత సమాచారం :

More