‘కంగువా’ను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసేది వీరే!

‘కంగువా’ను ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసేది వీరే!

Published on Sep 4, 2024 1:11 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కంగువా’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

ఇక ఈ సినిమాను తొలుత దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టైయాన్’ కూడా రిలీజ్‌ను లాక్ చేసుకుంది. దీంతో ఇప్పుడు కంగువా మేకర్స్ మరో డేట్ కోసం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డ్రిస్ట్రిబ్యూషన్ హక్కులు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలింస్స్ చేజిక్కించుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా, దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు