‘కంగువా’ రన్‌టైమ్‌లో మార్పు.. ఎంతంటే?

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శివ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో సూర్య రెండు వైభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే, ఈ సినిమా రన్‌టైమ్ విషయంలో పలు విమర్శలు రావడంతో చిత్ర యూనిట్ దానిని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సినిమా రన్‌టైమ్ కాస్త ఎక్కువయ్యిందనే వాదనలు వినిపించడంతో ఈ సినిమా రన్‌టైమ్‌ను 12 నిమిషాల మేర ట్రిమ్ చేశారట మేకర్స్. ఈ ట్రిమ్ చేసిన రన్‌టైమ్‌తోనే ఇప్పుడు కంగువా చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా సూర్య అభిమానులకు మరింతగా నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో అందాల భామ దిశా పటానీ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version