తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ మూవీ నవంబర్ 14న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలో సూర్య ఓ యోధుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
అయితే, ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట సరికొత్త ట్రోలింగ్‌కు దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ఎంతమేర వసూళ్లు రాబడుతుందని ఆశిస్తున్నారు.. అంటూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు నిర్మాత సమాధానం ఇచ్చాడు. ‘కంగువా’ చిత్రం వెయ్యి కోట్లు కాదు, రెండు వేల కోట్లు మాకు తెచ్చి పెడుతుందని ఆయన కామెంట్స్ చేశాడు.
దీంతో నెట్టింట తెగ ట్రోలింగ్ జరుగుతోంది. రెండు వేల కోట్లు వస్తాయని అనడంలో అంత ఓవర్‌కాన్ఫిడెన్స్ అవసరం లేదు అంటూ నిర్మాతపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమాలో మ్యాటర్ లేకపోతే 200 కోట్లు కూడా కష్టమే అంటూ వారు వారిస్తున్నారు. ఏదేమైనా సూర్య ‘కంగువా’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందని తమిళ వర్గాలు చెబుతున్నాయి.