సలార్ సీక్వెల్ పై కన్నడ నటుడు కీలక వ్యాఖ్యలు!


ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల కి పైగా వసూలు చేసే అవకాశం ఉన్న చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. కేజీఎఫ్‌ 2 తర్వాత దర్శకుడు చేస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ నటుడు దేవరాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, సలార్ రెండవ భాగం కూడా ఉంటుంది అని అన్నారు. సలార్‌లో తాను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని మరియు సీక్వెల్‌లో తన పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

పార్ట్ వన్ లో కూడా కనిపిస్తానని దేవరాజ్ తెలిపారు. దేవరాజ్ ఇంకా మాట్లాడుతూ, ప్రభాస్‌తో చాలా కాంబినేషన్‌ సీన్స్‌ వచ్చాయి. నటుడు జగపతి బాబు మరియు పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. కన్నడ నటుడు నుండి ఊహించని ఈ లీక్ నిజంగా ప్రభాస్ అభిమానులను సంతోషపెట్టింది. సలార్ సెప్టెంబర్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version