నాని సినిమాపై కన్నడ నిర్మాత ఫైర్

నాని సినిమాపై కన్నడ నిర్మాత ఫైర్

Published on Jan 30, 2025 7:02 PM IST

న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమా చేశాడంటే అందులో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఖచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఇక ఆయన నటించే సినిమాలు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. అయితే, నాని కెరీర్‌లో ఓ ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రాన్ని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు.

2023లో రిలీజ్ అయిన ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాపై కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత మండిపడుతున్నాడు. తమ బ్యానర్‌లో తెరకెక్కిన ‘భీమసేన నలమహారాజ’ అనే కన్నడ సినిమా 2020లో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యిందని.. ఈ సినిమాలోని కథను నాని ‘హాయ్ నాన్న’ చిత్రంలో వాడారని ఆ చిత్ర నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య విమర్శలు గుప్పించారు.

ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ రెండు సినిమాల కంటెంట్ ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, చాలా మంది ఈ రెండు సినిమాల కథలు పూర్తిగా వేరని.. కొంతమేర సీన్స్ ఆ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఉండొచ్చని తమ అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు