కన్నడ హీరో దర్శన్ ఓ అభిమానిని చంపిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నటి ప్రగతి గౌడకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడనే కారణంగా రేణుకాస్వామి అనే అభిమానిని కొంతమందితో కలిసి దర్శన్ హత్య చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు కన్నడనాట సంచలనంగా మారింది.
తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌజ్ లో శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదని శ్రీధర్ రాసిన ఓ సూసైడ్ నోట్ అక్కడ లభించింది.
దర్శన్ జైలులో ఉండగా ఈ ఆత్మహత్య ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక నటి ప్రగతి గౌడతో దర్శన్ గతకొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడని తెలుస్తోంది. దీని కారణంగానే రేణుకస్వామిని ఆగ్రహంతో దర్శన్ చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.