త్రివిక్రమ్ సినిమాలో కన్నడ స్టార్ మరోసారి.. !

Published on Nov 29, 2020 6:59 pm IST


‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని .. ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. గతంలో కూడా ఉపేంద్ర త్రివిక్రమ్ తో కలిసి పని చేశారు.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా 2021 దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More