హిందీ ప్రేక్షకుల్లో కాంతార కి సూపర్ క్రేజ్!

శాండల్‌వుడ్ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారలో తన అద్భుతమైన నటనతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలై నార్త్ ఇండియన్స్‌ని విస్మయానికి గురిచేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ (భారతదేశం)లో చలనచిత్రాల విభాగంలో ఒక వారం (డిసెంబర్ 5-11) వరకు అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా కాంతారా (హిందీ) నిలిచింది.

ఊహించిన విధంగానే ఈ చిత్రానికి హిందీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాంతార చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Exit mobile version