తెలుగులో భారీ ఓపెనింగ్స్ అందుకున్న “కాంతారా”.!

తెలుగులో భారీ ఓపెనింగ్స్ అందుకున్న “కాంతారా”.!

Published on Oct 16, 2022 3:03 PM IST

తాజాగా సినీ వర్గాల్లో మంచి సెన్సేషన్ గా మారినటువంటి కన్నడ హిట్ చిత్రం “కాంతారా”. దర్శకుడు అలాగే హీరోగా రిషబ్ శెట్టి నే నటించిన ఈ చిత్రం మొదట కన్నడలో భారీ హైప్ తో వచ్చింది. సినిమాలో కంటెంట్ కూడా నెక్స్ట్ లెవల్ ఉంది అనే టాక్ కూడా విస్తృతంగా పాకడంతో తెలుగులో కూడా ఈ చిత్రం తెలుగు డబ్ ఆలోచన లేకముందే మంచి హాట్ టాపిక్ గా మారింది.

మరి దీనితో ఈ చిత్రం తెలుగు రైట్స్ గీతా ఆర్ట్స్ వారు కొనుగోలు చేయగా దీనిని అసలు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకుండా రిలీజ్ చేయగా దీనికి ఊహించని రేంజ్ ఓపెనింగ్స్ మన తెలుగులో నమోదు అయ్యాయి. ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు వెర్షన్ లో 5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ పండితులు కన్ఫర్మ్ చేశారు. ఇది మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో అయితే తెలుగులో ఎలాంటి వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు