తెలుగులో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న “కాంతార” దూకుడు!

తెలుగులో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న “కాంతార” దూకుడు!

Published on Oct 28, 2022 5:33 PM IST

కన్నడలో చిన్న చిత్రం గా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార. సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో సౌత్ భాషలతో పాటుగా, హిందీ లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనం కొనసాగిస్తోంది. చాలా సినిమాలు విడుదలైనప్పటికీ, డబ్బింగ్ సినిమా టిక్కెట్ల విండోల వద్ద బలంగా ఉంది.

తెలుగులో ఈ సినిమా విడుదలై 13 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. వచ్చే వారంలో ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. కాంతార చిత్రం లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా రచన, దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో సప్తమి గౌడ కథానాయిక గా నటించింది. అచ్యుత్ కుమార్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు