కన్నడ సినిమా నుంచి గత ఏడాది వచ్చి పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో సైలెంట్ సెన్సేషన్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ తమిళ్ సహా హిందీలో సెన్సేషనల్ హిట్ అయ్యి మాసివ్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా మన దేశపు సంస్కృతికి అద్దం పట్టేలా ఎన్నో ప్రశంసలు కూడా ఈ చిత్రం అందుకుంది.
దీనితో ఇలా పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమా ఇప్పుడు మన తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ చిత్రం శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం అతి త్వరలోనే టెలికాస్ట్ కానున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనిపై డేట్ రావడమే తరువాయి. ఇక స్మాల్ స్క్రీన్ పై అయితే ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.