భారీ ధరకి తెలుగు “కాంతార” శాటిలైట్ హక్కులు


రిషబ్ శెట్టి హీరోగా నటించిన కన్నడ మూవీ కాంతార. ఈ చిత్రం చిన్న సినిమా గా విడుదలై దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ విధ్వంసం సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ కారణం గా ఓటిటి రిలీజ్ ను కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల నుండి 25 కోట్ల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ న్యూస్ ఏమిటంటే, ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ హక్కులను 4.5 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. డబ్బింగ్ సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. దీంతో తెలుగు మార్కెట్‌లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌పై మరింత స్పష్టత వచ్చింది. యూఎస్ఏలో కూడా తెలుగు వెర్షన్ దాదాపు 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ను హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.

Exit mobile version