అట్లీ లుక్స్ కాంట్రవర్సీపై కపిల్ శర్మ ఘాటు స్పందన..

అట్లీ లుక్స్ కాంట్రవర్సీపై కపిల్ శర్మ ఘాటు స్పందన..

Published on Dec 17, 2024 10:00 PM IST

బాలీవుడ్ సినిమా దగ్గర ప్రముఖ నటుడు అలాగే ఫేమస్ టాక్ షో కపిల్ శర్మ టాక్ షో వ్యాఖ్యాత అయినటువంటి కపిల్ శర్మ విషయంలో రీసెంట్ గా పలు ట్రోల్స్ పడ్డాయి. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ హిందీలో తాను నిర్మాణం వహించిన “బేబీ జాన్” ప్రమోషన్స్ లో భాగంగా తాను కపిల్ షోకి తాను హాజరు అయ్యాడు.

అయితే ఇందులో అట్లీ రంగుపై కపిల్ శర్మ చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ తనపై నెగిటివ్ తెచ్చాయి. దీనితో ఆ వైరల్ అవుతున్న క్లిప్ పై లేటెస్ట్ గా కపిల్ శర్మ కొంచెం ఘాటు గానే తన స్పందన అందించాడు. అసలు నేను ఆ వీడియోలో అట్లీ లుక్స్ కోసం ఎక్కడ తక్కువ చేసి మాట్లాడానో చూపించాలి అని అడుగుతున్నా అని తాను రిప్లై ఇచ్చారు.

అలాగే దానిని సర్క్యులేట్ చేస్తున్న నెటిజన్స్ కి కూడా సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారం చేయొద్దు అని, ముందు మీరు అంతా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి ఏది పడితే అది గొర్రెల్లా నమ్మొద్దు అంటూ ఘాటుగా తన స్పందనని కపిల్ శర్మ ఈ విషయంలో చెప్పడం ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు