బాలీవుడ్ ప్రముఖ దర్శక – నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఐతే, కరణ్ జోహార్ 2017లో సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు (యశ్, రూహీ) తండ్రి అయిన సంగతి తెలిసిందే. కాగా ఆ చిన్నారులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కరణ్ జోహార్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రూహీ ఫొటోను ఆయన ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘రూహీ వర్సెస్ సిరి’ అని క్యాప్షన్ పెట్టారు.
కాగా దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘సార్, ఇంతకీ రూహీ తల్లి ఎవరు ?, దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ విషయంలో నేను గందరగోళానికి గురి అవుతున్నాను’ అంటూ ఆ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ పై తాజాగా కరణ్ స్పందిస్తూ.. ‘ఆమెకు తండ్రి మాత్రమే కాదు, తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అందుకే, మీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది’’ అని కరణ్ జోహార్ పోస్ట్ చేశారు.