బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ ‘నేను కొంపలు కూల్చే అమ్మాయిని కాను’ అంటూ తన గురించి క్లారిటీ ఇచ్చింది. దీనికి కారణం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషనే. గతంలో హృతిక్- కరీనా కపూర్ జంటగా పలు చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో హృతిక్ తో కరీనా సన్నిహితంగా ఉంటోందని బాగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా కరీనా కపూర్ ఖాన్ అవన్నీ అవాస్తవాలు అని చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి కరీనా ఇంకేం మాట్లాడింది అంటే..
కరీనా మాటల్లోనే.. ‘నాకు వరకూ హృతిక్ మంచి వ్యక్తి. పైగా నేను తనతో సినిమాలు చేసే సమయంలో సుస్సానేతో అతను ప్రేమలో ఉన్నాడు. పైగా నాకు సుస్సాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్. అన్నిటికీ మించి నేను వేరొక అమ్మాయి ఉసురు పోసుకోలేనని కరీనా చెప్పింది. అయినా, హృతిక్ ఎవరికీ పడిపోడు. సుస్సాన్ కి నాకు ఈ విషయం బాగా తెలుసు. అలాగే, నేను ఎలాంటి వ్యక్తినో సుస్సాన్ కి కచ్చితంగా తెలుసు. అందుకే, మా పై ఎన్ని రూమర్స్ వచ్చినా తను వాటిని నమ్మలేదు’ అని కరీనా తెలిపింది. మొత్తానికి ఎప్పుడో వచ్చిన పుకార్లకు ఈ భామ ఇప్పుడు వివరణ ఇచ్చింది.