బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ తన సినీ కెరీర్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో నేను ఒకదాన్ని. ఐతే, నేను కేవలం రెమ్యునరేషన్‌ని దృష్టిలో ఉంచుకొని సినిమాల్లో నటించను. నాకు కథ ముఖ్యం. నా పాత్ర ముఖ్యం. కథ నచ్చితేనే ఆ సినిమా చేస్తాను. ఇది నేను, నా కెరీర్ స్టార్టింగ్ నుంచి పాటిస్తున్న నియమం’ అని కరీనా చెప్పింది.
కరీనా కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నటించిన సినిమా ఎలాంటిది..?, ఆ సినిమాలో నా పాత్రకి ఉన్న ప్రాధాన్యత ఎంత ?, ఇలా ప్రతి అంశాన్ని చూస్తాను. ప్రేక్షకులకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ.. సమాజంపై ప్రభావం చూపించేలా కథ ఉండటం నాకు ఇష్టం. అలాంటి సినిమా నా దగ్గరకు వస్తే కచ్చితంగా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా.. నటించడానికి నేను అంగీకరీస్తాను’ అంటూ కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’తో కరీనా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.