పవన్ కి సూర్య, కార్తీ స్పెషల్ థాంక్స్.!

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” లో జాయిన్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లోనే పలు ఊహించని కాంట్రవర్సీల విషయంలో కూడా పవన్ స్పందించడం నేషనల్ వైడ్ ట్రెండింగ్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ కోలీవుడ్ ప్రముఖ హీరో కార్తీ విషయంలో చేసిన కామెంట్స్ నిన్న పెద్ద ఎత్తున చర్చగా మారాయి.

అయితే కార్తీ సారీ చెప్పడం దానికి పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ మనం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ తన సినిమా “సత్యం సుందరం” రిలీజ్ కి హీరో కార్తీకి అలాగే నిర్మాత, కార్తీ సోదరుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తన బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే ఈ పోస్ట్ వేసిన వెంటనే కార్తీ రెస్పాండ్ అయ్యి పవన్ కి ధన్యవాదాలు తెలుపగా ఈ తర్వాత ఊహించని విధంగా సూర్య కూడా పవన్ పోస్ట్ కి రిప్లై ఇచ్చి థాంక్స్ చెప్పాడు. దీనితో వీరి రిప్లై లు ఫ్యాన్స్ లో స్పెషల్ గా మారి వైరల్ గా అయ్యాయి. మరి కార్తీ నటించిన సత్యం సుందరం ఈ సెప్టెంబర్ 27న తమిళ్ లో రిలీజ్ కానుండగా తెలుగులో 28న రాబోతుంది.

Exit mobile version