మహేష్ తో సినిమాపై కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మహేష్ తో సినిమాపై కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Oct 1, 2024 11:10 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమోళితో చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో అనేకమంది బిగ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే మహేష్ బాబు పలు మల్టీ స్టారర్ సినిమాలు ఇది వరకే చేసిన సంగతి తెలిసిందే. అలా మహేష్ తో సినిమాపై కోలీవుడ్ యువ హీరో కార్తీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

తాను మహేష్ బాబు చిన్నపుడు ఒకే క్లాస్ లో చదువుకున్నామని మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని మంచి కథ కుదరాలి అంటూ కార్తీ తెలిపాడు. దీనితో ఈ ఇద్దరి కలయికలో సినిమా సహా వారి చిన్నపుడు విషయాలు కూడా తెలిశాయని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా కార్తీ నటించిన “సత్యం సుందరం” సినిమా తమిళ్ సహా తెలుగులో హిట్ కాగా తెలుగులో జరిగిన లేటెస్ట్ ప్రెస్ మీట్ లో కార్తీ ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు